Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
దున్నేవాడికే భూమి కావాలని సాగిన విప్లవోద్యమంలో ఎర్ర జండాను తన గుండెకు కట్టుకున్న పోరాటయోధుడు కామ్రేడ్ దనసరి లచ్చయ్య అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్ అన్నారు. కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో న్యూ డెమోక్రసీ పార్టీకి ఎన్నో రకాలుగా సేవలందించిన దనసరి లచ్చయ్య ఈ నెల 16న మతి చెందగా శుక్రవారం తన స్వగ్రామమైన ఎంచగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. పాకాల కొత్తగూడెం ప్రాంతంలో పాలడుగు కృష్ణ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కషి చేసిన గొప్ప పోరాట యోధుడని విప్లవోద్యమానికి తన కొడుకైన గోపన్నను అంకితం ఇచ్చిన గొప్ప త్యాగధనుడని కొని యాడారు. ఈ ప్రాంతంలో పోడు భూముల పోరాటంలో ముందు నడిచిన వాడని, ఈ దోపిడీ వ్యవస్థను మార్చా లని,నూతనమైన దోపిడీ లేని సమాజం ఏర్పడాలని జరిగిన పోరాటంలో తన వంతు పాత్రను పోషించాడని వారు గుర్తు చేశారు. లచ్చయ్య చేసిన కృషిని స్మరించు కోవాలని, వారి త్యాగాల అడుగుజాడల్లో పయనించడమే వారికిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మోకాళ్ల మురళీకష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఊకే పద్మ, పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు నున్నా అప్పారావు, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజరు ఖన్నా, జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జు దేవేందర్, మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగేందర్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదంశెట్టి నాగేశ్వర్రావు, పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు బండి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.