Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఏఓ బానోతు రాంజీ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తేమ శాతాన్ని సొసైటీ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని తమ పొలాల్లో ఆరబెట్టుకుని, శుభ్రపర్చి నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే తక్షణమే కొనుగోలు కేంద్ర సిబ్బంది తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు వరి ధాన్యాన్ని శుభ్రపరచకుండా, ఆరపెట్టకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని వారి వరి ధాన్యాన్ని విక్రయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) అనుబంధ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నంబూరి మధు, రైతులు గుర్రం రామయ్య, నంబూరి వెంకటపిచ్చయ్య, బాల్ సింగ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.