Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ దేవనగరం ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులు విధులకు డుమ్మా కొడుతుండడంతో పేద విద్యార్థుల చదువు అటకెక్కుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు తోకల రవి ఆరోపించారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ బంధం పాఠశాలను సందర్శించి విద్యార్థులను తల్లితండ్రులను కలిసి వివరాలు సేరించినట్లు తెలిపారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాద్యాయులు విధులకు డుమ్మా కొడుతున్నారని వారు ఎప్పుడొచ్చేది తెలియడంలేదని రోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఉపాద్యాయులు రాకపోవడంతో అక్కడే కాసేపు ఆడుకుని ఇంటికి చేరుతున్నారని తెలిపినట్లు తెలిపారు. కోవిడ్ అనంతరం పాఠశాలలు తెరిచిన దగ్గర నుండి ఇదే తీరుగా ఉపాద్యాయులు వ్యవహరిస్తున్నారని విద్యార్థులకు కనీసం మధ్యాహ్న భోజనం కూడా పెట్టడంలేదని రవి ఆరోపించారు. పాఠశాలలో అపరిశ్రుబ్రంగా ఉండడంతో పాటు బండలు లేచి దుమ్ములో విద్యార్థులు కూర్చోవలసి వస్తుందని ఇప్పటికైనా సంబందిత అధికారులు పాఠశాలను సందర్శించి విధులకు డుమ్మా కొడుతున్న ఉపాద్యాయులపై చర్యలు తీసుకోని గైర్హజరైన కాలం జీతం కట్ చేయాలని రవి డిమాండ్ చేశారు. ఆయన వెంట గ్రామస్తులు జయకష్ణ, రాజేష్, కేశవ, సాయి, మహీన్ తదితరులున్నారు.