Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈ-ఆఫీసు ద్వారా పని విధానాన్ని సులభతరం చేసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధి కారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో మండల అభివృద్ధి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్, ఈ ఆఫీస్ పై చర్చించారు. జిల్లాలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 97.8 పూర్తయిందని అంబటిపల్లి, ఒడితల, వెలిశాల ఆరోగ్య కేంద్రాల పరిధి లో 2శాతం మిగిలి ఉన్నదని పూర్తి చేయాలన్నారు. ఒమి క్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ-ఆఫీసు ద్వారా జెడ్పీ, మండల అభివృద్ధి అధికారులు సమగ్ర సమా చారం పొందుపర్చాలన్నారు. ప్రతి అధికారి ఈ- ఆఫీస్ ఉపయోగించేలా సన్నద్ధం కావాలన్నారు.
పెండింగ్ ఆడిట్ పేరాలు పరిష్కరించాలి
ప్రతి శాఖలో ఉన్న ప్రభుత్వ పథకాల నిధుల విని యోగం ఆడిట్ తనిఖీ పెండింగ్ ఆడిట్ పేరాలను పరిష్కరించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో జెడ్పీ సీఈవో శోభారాణి, కలెక్టరేట్ పరిపాల నాధికారి మహేష్ బాబు, ఎంపీడీఓలు, ఎంపీవోలు, మున్సిపాలిటీ, ఎండోమెంట్ అధికారులతో చర్చించారు. శాఖల వారీగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో అభి వృద్ధి కార్యక్రమాల సమాచారం అడిగి తెలుసుకున్నారు. జమ, ఖర్చుల వివరాల నివేదికలు, రిజిస్టర్లలో నమోదు చేసి ఆడిట్ అధికారులకు సహకరించాలన్నారు. జెడ్పీ సీఈవో శోభారాణి, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్) శ్రావణ్ పాల్గొన్నారు.