Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలం లోని చెల్పూర్ ప్రధాన రహదారిలో ఉన్న కాకతీయధర్మల్ విద్యుత్ కేంద్రం జెన్కో స్థలంలో బస్టాండు నిర్మించాలని శ్రీ శ్రీనివాస వర్తక సంఘం అధ్యక్షులు అడ్డూరి శ్రీధర్‌రావు కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వినతిపత్రం అందించి ఆయన మాట్లాడారు. చెల్పూర్ ప్రధాన రహదారి జెన్ కో స్థలం లో చెల్పూర్ పరిసర గ్రామాల ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, భూపాలపల్లి లో ఏర్పాటు చేసినట్లు జెన్కో ప్రహారీ పక్కన షెడ్లు నిర్మించి చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించాలన్నారు. ఇదే ప్రాంతంలో శాశ్వత కూరగాయల మార్కెట్ షెడ్డు ఏర్పాటు చేయడం జాతీయ రహదారి చెల్పూర్ పరిధిలో ప్రమాదాల నివారణకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, ఎక్కువ మొత్తంలో భారీ వాహనాలు, లారీలు రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దుబ్బపల్లి రోడ్డుకు కాకుండా పెట్రోల్ బంక్ ముందు నుండి వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ సొసైటీ చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస వర్తక సంఘం అధ్యక్షులు అడ్డూరి శ్రీధర్ రావు, అడ్డ గుడి రాజేందర్, మొకిరాల తిరుపతిరావు, గంగరాజు, శ్రీనివాస్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు