Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించి వేతనాలు పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం( సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు కుమ్మరి పద్మ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయం ఎదట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డబ్బులుచెల్లించాలన్నారు. కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. తదితర డిమాండ్ల సాధనకు దశలవారీగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు శారద, దుర్గం సమ్మక్క, తదితరలు పాల్గొన్నారు.