Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చుక్కయ్య
నవతెలంగాణ-ఐనవోలు
ప్రభుత్వ భూములను పేదలకు పంచా లని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్య దర్శి చుక్కయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కయ్య మాట్లాడారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని, అక్రమంగా చేసిన పట్టాలను రద్దు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమంగా కోత పెడుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని వెంకటాపురంలోని సర్వే నెంబర్ 324/ సిలోని 132 ఎకరాలు, నందనంలోని సర్వే నెంబర్ 955లోని 40 ఎకరాల భూమిని దళితులు సాగు చేసుకుంటుండగా అధికారులు, ప్రజాప్రతినిధులు అండతో అక్రమార్కులు ఆక్రమించుకుని అక్రమంగా పట్టా చేయించుకుని దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సదరు పేదలకు భూములను అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్దఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ రాజేష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు గుండెకారి మహేందర్, దర్శనాల సంపత్, నారాయణరెడ్డి, గోపాల్, బాబు, సలీమ్, వేణు, యాదగిరి, నర్సయ్య, పోచమ్మ, కుమారస్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.