Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి
- రూ.38 లక్షలతో చెరువు తూము పనులు ప్రారంభం
నవతెలంగాణ-తాడ్వాయి
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి తెలిపారు. మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారం పెద్ద చెరువుకు రూ.38 లక్షల వ్యయంతో చేపట్టిన కొత్త తూము పనులను ఐబీ అధికారులతో కలిసి గంగారం, కాటాపూర్ సర్పంచ్లు గౌరబోయిన నాగేశ్వరరావు, పుల్లూరి గౌరమ్మ అధ్యక్షతన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడారు. 2018 ఆగస్టు 19న అన్నారం పెద్ద చెరువు తూము వద్ద బుంగపడి శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. సమస్యను ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లి రూ.38 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. గంగారం, కాటాపూర్, అన్నారం, భూపతిపూర్ రైతులకు సాగునీటి సమస్య ఉండదని చెప్పారు. రైతుల సమస్యలను మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూశెట్టి రమేష్ మాట్లాడుతూ దామెరవాయి చెరువు కూడా శిథిలావస్థలో ఉన్న క్రమంలో త్వరగా మరమ్మతు చేయించాలని ఐబీ డీఈ సదయ్యకు చెప్పారు. కార్యక్రమంలో ఐబీ ఏఈలు ప్రశాంత్, అరవింద్, కాంట్రాక్టర్ ముండ్రాతి రాజమౌళి, మండల కోఆప్షన్ సభ్యుడు దిలావర్ ఖాన్, బీజేపీ మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు, సింగిల్ విండో డైరెక్టర్ ఇందారపు లాలయ్య, మాజీ సర్పంచ్లు పులి పెద్దనర్సయ్య గౌడ్, ముజాఫర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రంగు సత్యనారాయణ, యాలం విక్రమ్, బాగే కోటేష్, నాయకులు పులి చిననర్సయ్య గౌడ్, మేడిశెట్టి పురుషోత్తం, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్ రావు, కుసుమ వెంకటేశ్వర్లు, కొండూరి నరేష్, మేడిశెట్టి ఆనందం, పాలకుర్తి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.