Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాకు 10 కేజీల తరుగు
- మిల్లర్ల తీరుపై కలెక్టర్ ఫిర్యాదు
- తామర పురుగుతో మిర్చి నాశనం
- భద్రాచలం ఎమ్మల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-వెంకటాపురం
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని భద్రాచలం ఎమ్మెలఏయ పొదెం వీరయ్య విమర్శించారు. మండలంలోని మార్కెట్ యార్డు సమీపంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆధ్వర్యంలోని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను సాకుగా తీసుకుని మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబోసి, అధికారులు తేమ శాతం పరిశీలించి బస్తాల్లో కాటాలు వేసీ ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తున్నా పలు సాకులతో క్వింటాకు సుమారు 10 కేజీల వరకు తరుగు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యను వివరించారు. నాణ్యత పరిశీలించి దన్యాన్ని మిల్లర్లకు తరలించిన తరువాత నాసిరకం పేరుతో మిల్లర్లు దాన్యాన్ని తగ్గించ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మిర్చి పంటకు తామర తెగుళ్లు సోకి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హర్టికల్చర్ అధికారులు పర్యటించి రైతులకు సూచనలు అందించాలని కోరారు. తెగుళ్ల నివారణకు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహన్రావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చంద్రకళాధరరావు, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాంబశివరావు, సునీల్, రమేష్, ఎంపీటీసీ రవి, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు.