Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 120 తులాల బంగారం, సెల్‌ఫోన్ స్వాధీనం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పీజీఆర్ అపార్ట్మెంట్ చోరీ కేసుకు సంబందించి కాజీపేట పోలీసులు మరో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు సెల్‌ఫోన్, వెయ్యి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి వివరాలను వెల్లడించారు. గత సెప్టెంబర్ 26న ఆర్ధరాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు దుండగులు కాజీపేట పోలీస్ స్టేషన్పరిధిలోని పీజీఆర్ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ దొంగలు భారీ మొత్తం బంగారు అభరణాల చోరీకి పాల్పడ్డారు. చోరీ అనంతరం నిందితులు తిరిగి మధ్యప్రదేశ్ చేరుకోని చోరీ చేసిన బంగారు అభరణాలను స్థానిక బంగారు వ్యాపారస్తుడు మహేష్, బాలు, ముకుందు అమ్మి సొమ్ము చేసుకున్నారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను నిందితుడు బాలు, ముకుంద్ తమ రెండవ కుమారుడు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు మహేశ్చంద్రజలోరా వద్ద చోరీ బంగారం నుండి 120 గ్రాముల బంగారు ఆభరణాలను భద్రపర్చాడు. ఈనెల 4న నిందితుడితో పాటు, చోరీ సొత్తును కొనుగోలు చేసిన నిందితుడు బాలు, ముకుందను కాజీపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండకు తరలించారు. ప్రస్తుతం జైలులో వున్న తన తండ్రికి బెయిల్ ఇప్పించేందుకుగాను నిందితుడు మహేశ్ చంద్ర జలోరా తన వద్ద వున్న చోరీ సొత్తును అమ్మి వచ్చిన డబ్బుతో తన తండ్రికి బెయిల్ ఇప్పించేందుకు చోరీ సొత్తును భద్రపర్చుకున్న నిందితుడు వరంగల్ కోర్టు పరిసరాలోకి వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో కాజీపేట్ పోలీసులు వెళ్ళి నిందితుడుని అదుపులోకి తీసుకోని అతని వద్ద వున్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులోని బంగారు అభరణాలను గుర్తించిన పోలీసులు నిందితుడిని విచారించగా నిందితుడు తాను చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీి శ్రీనివాస్, కాజీపేట ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు వెంకటక్రిష్ణ, ప్రశాంత్, నవీన్, సురేష్, సదానందం, సతీష్‌రెడ్డి, రంజిత్‌లను పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి అభినందించారు.