Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ హరిసింగ్
- నిధులు దుర్వినియోగమయ్యాయి : కాంగ్రెస్
- వాడీవేడీగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలో మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బి హరిసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్ అలసత్వం వల్ల భగీరథ లక్ష్యం నెరవేరకుండా పోతోందని పలువురు కౌన్సిలర్లు తెలపగా .ఇంజనీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచడానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కౌన్సిల్ సమావేశంలో 55 ఏజెండా అంశాలను ప్రవేశపెట్టగా 14 అంశాలపై కాంగ్రేస్ వార్డు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లోర్ లీడర్ వేముల సాంబయ్య నేతృత్వంలో డీసెంట్ నోటీస్ అంద జేశారు. బతుకమ్మ, దసరా ఉత్సవాల పేరిట రూ. 10లక్షలు ఖర్చులు చూపెట్టడడంపై లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి నిధుల నుంచి సశ్మానవాటికలో ఎర్రమట్టి పేరిట రూ.20లక్షలు, డివైడర్లకు రంగులకు రూ.9లక్షల నిధులు దుర్వి నియోగం జరిగిందని ఆరోపించారు. రివిజన్ పేరుతో తిరిగి ఆస్తి పన్ను పెంచేందుకు యత్నించడం సరైంది కాదని, రివిజన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై కౌన్సిల్లో చర్చ వాడీవేడిగా సాగింది. కాగా బతుకమ్మ, దసరా ఉత్సవాలకు కేటాయించిన రూ.8.82 లక్షలు ఖర్చులపై కౌన్సిల్ ఆమోదించింది. రూ.2.03 కోట్ల విలువజేసే నిధులకు వివిధ పనులకు పరిపాలన అనుమతిపై తీర్మానం చేశారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో అటవీ శాఖ నుంచి 69వేల మొక్కలు నాటడానికి రూ.34లక్షల 50వేలను గ్రీన్ బడ్జెట్ నుంచి చెల్లించడానికి ఆమోదించారు. జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు పట్టణ ప్రగతి నుంచి రూ.30లక్షలు నిధులను కేటాయించారు. అంగడి రోడ్‌లోని ఓడీసీ ఎంఎస్ స్థలంలో వాణిజ్యపరమైన ఉపయోగానికి మార్చ డానికి అనుమతిపై తీర్మానం చేశారు. సశ్మానవాటిక ప్రహరి గోడ నిర్మాణానికి రూ.38లక్షలు, మహబూబా బాద్ రోడ్డులోని పట్టణ ప్రకృతి వనాలలో పట్టణ ప్రగతి నుండి రూ.3లక్షలు, బోర్, మోటర్ అమర్చడానికి రూ.3లక్షలు, ఫిల్టర్ బెడ్ వద్ద నర్సరీ నిర్వహణ, డంపింగ్ యార్డు, విద్యుత్ మోటర్ల మరమ్మత్తుల ఖర్చులక ఆమోదం తెలుపగా మున్సిపల్ పార్కులో పంచతంత్ర పార్కు అభివృద్ధికి రూ.4.80లక్షలకు పరిపాలన అనుమతి, అంగడి మైదానంలోని మోడల్ మార్కెట్లో టాయిలెట్ల నిర్మాణానికి రూ.20లక్షలు, నెహ్రు పార్కులో ఫౌంటెన్‌కు రూ.5లక్షలు, సశ్మాన వాటికలో ఎర్రమట్టి పోయడానికి రూ.20లక్షలు, పాకాల రోడ్డులోని సశ్మాణ వాటికలో టాయిలెట్లకు మిగులు పనులకు రూ. 12లక్షలు నిధులు వినియోగంపై అనుమతికి తీర్మాణం ఆమోదించారు. ముగ్థుంపురం లోని సర్వే నెంబర్ 238/1లోని ఎకరం స్థలంలో ఫికల్ స్లడ్జ్ అండ్ సెప్టెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి, సశ్మానవాటికల్లో బర్నింగ్ ప్లాంట్లకు ప్యురినల్ వైర్ ఏర్పాటుకు రూ.20లక్షలు కేటాయింపుకు, ద్వారకపేట రోడ్డులో ప్యాచ్ వర్క్‌కు రూ.3లక్షలు, ద్వారకపేటలోని సశ్మానవాటికలో గ్రావెల్ ఫిల్లింగ్ చేయడానికి రూ.5లక్షల చొప్పున వినియోగించడానికి పరిపాలన అనుమతితోపాటు తదితర అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. పట్టణం లోని విద్యుత్ స్థంభాల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ ఇంజనీరు అధికారులు రూపొందించిన రూ.50. 18లక్షల కేటాయింపు అంచ నాలకు కౌన్సిల్ ఆమోదిం చాలని అదనపు కలెక్టర్ సభ్యు లను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కమిషనర్ విద్యాధర్, మేనేజర్ సంపత్ కుమార్, ఇంజనీరు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.