Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిష్కారం దశకురాని సమస్యలు
- కొనసా...గిన సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-రాయపర్తి
మూడు నెలలకోసారి జరిగే మండల సర్వసభ్య సమా వేశం శుక్రవారం మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యా లయంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన జరిగింది. 39మంది సర్పంచులకు 29మంది,16 మంది ఎంపీటీసీలకు 10మంది హాజరయ్యారు. వీరిలో మహిళ ప్రజా ప్రతి నిధులకు సంబంధించిన వారు సమీక్ష హాల్ బయట రిజిస్టర్ లో సంతకాలు పెట్టడం కొసమెరుపు. మొదటగా వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, వైద్య శాఖలపై చర్చ సాధారణంగా జరిగింది. మండల పరిధిలో పూర్తి స్థాయిలో కరోనా టీకాలు వేస్తున్నట్లు డాక్టర్ వెంకటేష్ తెలిపారు. విద్యాశాఖ కార్యక్ర మాలపై సమీక్ష నిర్వహించగా మధ్యాహ్న భోజనంతో విద్యా ర్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచులు తెలి పారు. వంట నిర్వాహకులు లేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోతుందన్నారు. కొండాపురం పాఠశాలలో రెండు నెలల నుండి సర్పంచ్ దయాకర్రావు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం సొంత ఖర్చులతో చేపడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం భోజన మహిళా సంఘాల వారికి సకాలంలో బిల్లులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో సీపీఎస్ పాఠశాల భవనం శిధిలమై పోతోందని, విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలకు తరలించాల్నఇ, పాఠశాల స్థలాన్ని గ్రామపంచాయతీ వారికి అందించాలని తీర్మానం చేశారు. అనంతరం డిఆర్డిఎ, స్వయం సహాయక కార్యక్రమాలపై సమీక్షించారు. కాగా సర్పంచులు, ఎంపీటీసీలు అడిగే ప్రశ్నలకు ఏపీఎం దాటవేసే సమాధానాలు చెప్పారు. ఐకెపి కేంద్రాల్లో దళారుల హవా కొనసాగుతుందని సర్పంచులు ఆరోపించారు. మ్యాచర్ పేరుతో రైతులను అరిగోస పెడుతున్నారని తెలిపారు. ఉకల్ గ్రామంలో శ్రీ నిధిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని సర్పంచ్ హరినాథ్ ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యక్ర మాలపై సమీక్షించారు. కాగా ఏఈలు ప్రజాప్రతినిధులకు సమాధానాలు చెప్పడంలో విఫలమవ్వడం గమనార్హం. అధికారులు సాగదీసే సమాధానాలు చెప్పొద్దని ఎంపీపీ అన్నారు. జెడ్పీటీసీ రంగుకుమార్, ఎంపీడీఓ కిషన్, తహసీల్దార్ సత్యనారాయణ, ఏఓ వీరభద్రం, ఎంఈఓ రంగయ్య, ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీదేవి, ఏపీఓ కుమార్, ఏపీఎం అశోక్, ఎంపీఓ రాంమ్మోహన్, పీఆర్ ఏఈ కిరణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి శతి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.