Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని జగ్గుతండ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చింత వీరభద్రం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ఎంపీటీసీ తమ్మిశెట్టి కుమారి తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త సోమిరెడ్డి మాట్లాడుతూ...ఎంపీటీసీ కుమారి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ బయ్యారం మండలానికి ఎనలేని సేవలు అందిస్తూ రోజు రోజుకూ ప్రజల మన్ననలను పొందుతున్నారని అన్నారు. అందులో భాగమే జగ్గుతండ గ్రామ వాసి నిరుపేద కుటుంబామైన చింత వీరభద్రయ్య కు 5 వేలు రూపాయలు అందించారని తెలిపారు. అంతేకాకుండ టిఆర్ఎస్ పార్టీ పెద్దలతో, మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడి వీరభద్రయ్యకు ఆరోగ్య రీత్యా అన్నీ విధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుంజ వీరస్వామి, వార్డు సభ్యుడు రమేష్, టీఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు రామాచారి, నాయకులు వాంకుడోత్ రామోజీ నాయక్, ఆరికట్ల పాపిరెడ్డి, మండ నాగరాజు, తమ్మిశెట్టి వెంకటపతి, నాగిరెడ్డి, నీలారపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.