Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కేంద్ర అధికా రుల బృదం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని శనివారం సందర్శించింది. ఎన్‌హెచ్ ఎం ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్లు విజరు కృష్ణన్, నాగేంద్రన్, జిల్లా క్వాలిటీ మేనేజర్ భాను కుమార్, ఏఓ శ్రీనివాస్ తదితరులు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం లాబ రేటరీ, వార్డులను సందర్శించారు. ఆస్పత్రికి అవ సరమైన సామాగ్రి వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఆస్పత్రిలో దంత వైద్యానికి సంబంధిం చిన వస్తువులను సమకూర్చాలని, ఆపరేషన్ థియేటర్లో ఇంకొక కొత్త ఓటి టేబుల్‌ను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఆస్పత్రికి విద్యుత్ మరమ్మతులు చేయాలని బృందానికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్ వివరించారు. కాగా ఆస్పత్రికి రెండు గైనకాలజిస్ట్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. మరొక పోస్ట్ ఖాళీగా ఉందన్నారు. అనెస్థెటిస్టును నియమించాల్సి ఉందని తెలిపారు. వాటిని త్వరగా భర్తీ చేస్తే మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఆస్పత్రి నుంచి రెఫర్ చేస్తున్న కేసుల వివరాలను, ఆస్పత్రికి ఉన్న అంబులెన్సుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.