Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కాజీపేట బ్రిడ్జి నుంచి కడిపికొండ బ్రిడ్జి వరకు నిరసన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీరాజలి, అర్బన్ అధికార ప్రతినిధి గుఱ్ఱపు కోటేశ్వర్, పీఏసీఎస్ డైరెక్టర్ మెరుగు రాజయ్య, కాంటెస్ట్ కార్పొరేటర్లు సందెల విజరు, బైరి లింగమూర్తి, వస్కుల శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.