Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన టీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలిచి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాలన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండించిన పంటను కేంద్ర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 20న నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. రైతుల పక్షాన నిలుస్తూ కేంద్రంపై పోరాటాలు మరింత ఉధతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జారి రాజు, ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లెందుల బేబీ శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ తాటికాయల వరుణ్, పెంతల రాజుకుమార్, వైస్ ఎంపీపీ కనకయ్య, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి రజిత యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పర్వతగిరి
ఈ నెల 20న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని గ్రామాల్లో, మండలాల్లో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ధాన్యం కొనకుండ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదునాం చేయాలని చూస్తోందన్నారు. యాసంగిలో రైతులు వరి వేసి నష్టపోవద్దని, వారికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరారు. 20న చేపట్టే నిరసన కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లునావత్ కమల, జెడ్పీటీసీ బానోత్ సింగులాల్ జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సర్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఎల్కతుర్తి
ఈ నెల 20న ప్రతీ గ్రామంలో బీజేపీ శవ యాత్ర చేపట్టాలని వరంగల్ అర్బన్ జిల్లా జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అన్నారు. శనివారం విశాల సహకార సంఘంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాల సహకార సంఘం అధ్యక్షుడు శ్రీపతి రవీందర్ గౌడ్, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగేడ నగేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బూర్గుల రామారావు, వైస్ చైర్మన్ శేషగిరి, టీఆర్ఎస్ రాష్ట నాయకుడు గోల్లే మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి పైండ్లా తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.