Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి సమాజానికి దిక్సూచి కావాలని సిఐ కరుణాకర్‌రావు అన్నారు. ఇంటర్ పరీక్షల్లో శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యా ర్థులు స్టేట్ ర్యాంకులు సాధించడంతో కళాశాలలో విద్యార్థు లకు శనివారం శాలువలు కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సత్కరించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో గోవింద్ శతి డైరీ టెక్నాలజీలో 487తో స్టేట్ 2వ ర్యాంకు, తిరుమల కళ్యాణి ఎంపిహెచ్ డబ్ల్యూలో 478తో స్టేట్ 5వ ర్యాంకు, గుగులోత్ భూమిక ఎంపిహెచ్డబ్ల్యులో 465, గుగులోత్ అఖిల ఎంపిహెచ్ డబ్ల్యులో 458, బానోత్ మమత ఎంపిహెచ్ డబ్ల్యు 449,గుగులోత్ పావని 444, షేక్ నేహ ఎంఎల్టి లో 500 కు 452, భూక్య శివ ఈటిలో 500 కు 427 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వారిని సీఐ అభినందించి మాట్లాడారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, కష్టాలను అధిగమించి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవడంతో వారి లక్ష్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ అశోక్, డైరెక్టర్లు సాగర్, శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు యాదగిరి నాయక్, అధ్యాపకులు శ్రీనివాస్, రజిత విద్యార్థులు పాల్గొన్నారు.