Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమ గోవర్ధన్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో శనివారం నిర్వహించిన మండల కౌన్సిల్ సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీవో నెంబర్ 317 లో పొందుపర్చిన అసంబద్ధలను సవరించాలి, స్థానికత సీనియార్టీ ప్రకారం విభజన చేయాలన్నారు. వికలాంగులకు బదిలీల్లో 40 శాతం పర్సంటేజ్ని అమలు చేసి వితంతు వులు, విడాకులు పొందిన వారికి, అవివాహిత మహిళలకు విభజనలో ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాలకు కేటాయించే ముందే టీచర్ల బదిలీలు నిబంధనలను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు యోగానంద, కార్యదర్శి ఉప్పలయ్య, మండల నాయకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, శ్రీహరి, శంకర్, విజరుకుమార్, పార్వతి, అన్నపూర్ణ, షబ్బీర్, వెంకటేశ్వర్లు, కత్తి నెహ్రూ, వీరబాబు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.