Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రతిఒక్కరూ ఆరోగ్య బీమా పథకంలో చేరాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డోర్నకల్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ రవీందర్ కోరారు. డోర్న కల్ మండలంలోని చాంప్లాతండాకు చెందిన మాలోత్ బాబు కుటుంబానికి మనిపాల్ సిగ్నా ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల చెక్కును మేనేజర్ రవీందర్ శనివారం అందించారు. ఈ సందర్భంగా మేనేజర్ రవీందర్ మాట్లాడారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో మనిపాల్ సిగ్నా బీమా పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పా రు. వివరాల కోసం మణిపాల్ సిగ్నా యూనిట్ మేనేజర్ మహమ్మద్ ఖాదర్ఖాన్ను సెల్ నెంబర్ 8688262190లో సంప్రదించాలన్నారు. కార్య క్రమంలో బ్యాంక్ సిబ్బంది రాము, అనిల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.