Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బృహత్ పల్లె ప్రకృతి వనం పనుల అడ్డగింత
నవతెలంగాణ-మంగపేట
కుటుంబమంతా కలిసి ఆరుగాలం కష్టపడి కొట్టుకున్న పోడుభూమిలో అధికారులు బహత్ పల్లెపకతి వనం పనులు చేయడానికి వచ్చిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను సిబ్బందిని ఆ దంపతులు అడ్డుకున్నారు. ఆడపిల్లల తండ్రినయ్య.. సాదుకుంటానికి ఈ భూమి తప్ప మరేమీ లేదు.. ఇప్పుడా భూమిలో ప్రభుత్వం బహత్ పల్లె పకతి వనం ఏర్పాటు చేస్తే నేనెట్లా బ్రతికేదంటూ.. దంపతులు రోదించిన తీరుతో ఆ భూమిలో పనులు చేయడానికి మనసొప్పని అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది వెనుదిరిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మల్లూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వం బహత్ పల్లె పకతి వనం ఏర్పాటుకు గ్రామంలోని హరిత హోటల్ సమీపంలో 5 ఎకరాల భూమిని గుర్తించి రెండు నెలల క్రితం చదును చేసి భూమి చుట్టూ ట్రంచ్ ఏర్పాటు చేసింది. పొట్టకూటి కోసం యోగా క్లాసులు చెబుతూ ఊరూరా తిరిగే రాంబాబుకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. తెలిసిందే తడువుగా తహసీల్దార్, మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓలను ఆయన కలిసి ఆ భూమిని తాను, తన కుటుంబం 20 ఏండ్ల కింద నుంచి పోడు చేసుకుని సాగు చేసుకుంటున్ననంటూ గ్రామానికి చెందిన యర్రంకని రాంబాబు అధికారులకు మొర పెట్టుకున్నాడు. అయినా వినని అధికారులు అది ప్రభుత్వ భూమి అని, అందులో ప్రభుత్వం బహత్ పల్లె పకతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. దీంతో రాంబాబు నాటి నుంచి భూమిని దక్కించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్, ఇతర రాజకీయ, కులసంఘాల నాయకుల సహాయంతో అధికారులను మెప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో శనివారం పనులు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ట్రాక్టర్‌తో పొలం వద్దకు రాగానే పనులు చేయకుండా రాంబాబు దంపతులు బైఠాయించి పనులు అడ్డుకున్నారు. తన కుటుంబానికి అన్యాయం చేయద్దని దంపతులు రోదించడంతో వారు పనులు చేయకుండా విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పి వెనుతిరిగి వెళ్లారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడు పట్టించుకోని బృహత్ పల్లె ప్రకృతి వనం మరో చోట ఏర్పాటు చేయాలని దంపతులు కోరుతున్నారు.