Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
క్వారీ ప్రమాదంలో చనిపోయిన కుటుం బాలకు ఒక్కొక్కరికి 25లక్షల రూపాయలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ ప్రభాకర్‌రెడ్డి, ఐనవోలు మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య డిమాండ్ చేశారు. వనమాల కనపర్తి తరాలపల్లిలో గ్రానైట్ క్వారీలో శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మతి చెందిన డ్రైవర్ ముఖేష్, ఈ టెక్ హెల్పర్ హకీమ్, ఆపరేటర్ చందుల మతదేహాలను ఎంజీఎం మార్చురీ వద్ద సీపీఐ(ఎం) ప్రతినిధి బందం పరామర్శించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. వద్దిరజు రవి చంద్రకి చెందిన గ్రానైట్ క్వారీలో 30మంది కార్మికులు పని చేస్తున్నా ఒక్కరికి కూడా లేబర్ నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించ కుండబా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట యాజ మాన్యం కార్మికులతో ప్రమాదకరమైన పనులు చేయిస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి ఆదు కోవాలని, నిబంధనలు పాటించని యజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యుడు, సర్పంచ్ బండి పర్వతాలు, మహేందర్ పాల్గొన్నారు.