Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథ్‌పల్లి
ఈ నెల 28, 28 తేదిల్లో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలను జయ ప్రదం చేయాలని రఘునాథపల్లి పార్లీ మండల కమిటీ కోరింది. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కావటి యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకటరాజం మాట్లాడారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో జనగామ పట్టణంలో నిర్వహిస్తున్న ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలన్నారు. 28న ఉదయం 10 గంటలకు బస్టాండ్ నుంచి వైష్ణవి గార్డెన్ వరకు నిర్వహించే ర్యాలీలో ప్రజలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ మహాసభలో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసేందుకు చర్చలు జరపనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పొదల నాగరాజు, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, నాయకులు కాసాని పుల్లయ్య, మంచాల మల్లేష్, ఇంజ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు