Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
అమ్మాయిలకు ఉన్నత అవకాశాలను కల్పించడానికి తల్లిదండ్రులు వారి చదువులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో 95 మంది కళ్యాణలక్ష్మీ పథకం లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మాయిల పెండ్లీ ఈడు వయస్సు 21 యేండ్లకు పెంచడాన్ని స్వాగతీస్తున్నామన్నారు. వయస్సును పెంచడం వల్ల ఆడపిల్లలు ఉన్నత చదువులను అందిపుచ్చుకొనే అవకాశాలు మెరుగు పడుతా యని అభిప్రాయపడ్డారు. పైసా లంచం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ పథకం అమలు అవుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు మోతె కలమ్మపద్మనాభ రెడ్డి, వేములపెల్లి ప్రకాశ్‌రావు, బాధవత్ వీరేందర్, కాట్ల కోమల భద్రయ్య తదితర సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.