Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గీసుకొండ
అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యయంతో పనిచేయాలని, అప్పుడే గ్రామాలు అభివృధ్ధి చెందుతాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కషిచేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.
కొన్ని గ్రామాల్లో శ్మశానవాటికల నిర్మాణం, మిషన్ భగీరథ పనులు ఇంకా పూర్తి కాలేదని, ఈ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామాల అభివద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎందుకు వినియోగించడం లేదని పలువురు సర్పంచులను ప్రశ్నించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనుల పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.