Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు
నవతెలంగాణ-హన్మకొండ
రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. శనివారం హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తోట చంద్రకళ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తున్నదని వాపోయారు. ఎన్నికల సంస్కరణలపై చర్చిం చాలంటే అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని, కానీ అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘంలో కాదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లతో పిండి రహస్య బేటీ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. కేంద్రం సీబీఐ, ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లను తమ ప్రయోజనాలకు వాడుకుం టున్నదని, అవి స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. మరోవైపు ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తూ దాడులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
బీజేపీపై కేసీఆర్ పూటకోమాట మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తునే ఉన్నారన్నారు. రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు సీపీఐ ఉద్యమిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శులు మేకల రవి, పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా నాయకులు తోట బిక్షపతి, మండ సదాలక్ష్మి, ఉట్కూరి రాములు, జూలియస్ సీజర్, బుస్సా రవీందర్, గన్నారపు రమేష్, మద్దెల ఎల్లేష్, అక్కపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.