Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ప్రజాసమస్యల పరిష్కారమే తన లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. మండలంలోని గుండెంగ, టీఆర్ఎస్ తండా, గాజులగట్టు, మదనాపురం, రాంసింగ్ తండా పంచాయతీల్లో శనివారం 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ హాజరై మాట్లాడారు. ప్రజలు అడిగిన సమస్యలకు అధికారులతో కలిసి ఎన్ని రోజులు సమయం పడుతుంది ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖాసీమ్, ఎంపీపీ ఆరె వీరన్న, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, గాజులగట్టు, మదనపురం, గుండెంగ, రామ్సింగ్తండా సర్పంచ్‌లు పడిగె వసంత, లింగాల రణధీర్‌రెడ్డి, రవిసింగ్ రాథోడ్, మంగీలాల్, గుండెంగ ఎంపీటీసీ బోడ కిషన్, నాయకులు సంపత్‌రావు, కటార్ సింగ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.