Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెచ్ఐవీ, టీబీ, సుఖవ్యాధులపై సదస్సు
నవతెలంగాణ-ఏటూరునాగారం
చైల్డ్ఫండ్ ఇండియా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆకులవారి ఘనపురం సర్పంచ్ సం రామ్మూర్తి అన్నారు. ఆ గ్రామంలో చైల్డ్ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ/ఎయిడ్స్, టీబీ, సుఖవ్యాధులపై అవగాహనా సదస్సు నిర్వహించగా ముఖ్యఅతిథిగా సర్పంచ్ రామ్మూర్తి హాజరై మాట్లాడారు. ప్రజలు హెచ్ఐవీ/ఎయిడ్స్, టీబీ, సుఖవ్యాధులపై అవగా హన పెంచుకోవాలని సూచించారు. జోనల్ సూపర్వైజర్ కుమారస్వామి మాట్లాడుతూ సంస్థ సేవలను వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహ్ద్ రఫీయుద్దీన్, ఏఎన్ఎం గీత, సుగుణావత్, బిల్ కలెక్టర్ సుధాకర్, లక్ష్మీ నారాయణ, సీఎల్‌డబ్ల్యూ రామ్‌కుమార్, వీరన్న, తిరుపతి, ఆశావర్కర్లు అరుణ, సరిత, తదితరులు పాల్గొన్నారు.