Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రజాసమస్యలే ఎజెండాగా ఈనెల 20, 21 తేదీలలో గార్ల పట్టణంలో సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను నిర్వ హిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు సమ్మెట రాజ మౌళి తెలిపారు. మహాసభల విజయవంతం కోరుతూ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నున్నా నారాయణనగర్ కాలనీ లో శనివారం వాల్పోస్టర్ ఆవిష్కరించారు. మహాసభలో గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలను నిర్ధేశించుకోనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తప్పుడు విధానాలపై మహా సభలో చర్చిస్తారని చెప్పారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శులు పంజాల ఉపేంద్ర, జంగం కళావతి, కూడాకంటి అనిత, సెల్మోజు వెంకన్న, దార్ల గురువయ్య, తోట పుష్ప, బొజ్జ మంగమ్మ, నక్క శాంతమ్మ, గాదరి అరుణ, బేతంచెర్ల శైలజ, బుడిగె భార్గవి, భూక్య సుగుణ, ప్రియాంక, వీణపెల్లి కవిత, కనకం అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.