Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వాహనదారులతో కఠినంగా వ్యవహరించే ట్రాఫిక్ పోలీసుల కఠినత్వం వెనకాల మానవత్వం దాగి ఉందనే ఘటన వరంగల్ నగరంలోని చౌరస్తా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. వరంగల్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శరత్‌కు మహిళ కింద పడిపోతుండగా గమనించి పట్టుకొని కింద కూర్చో బెట్టాడు. అనారోగ్య కారణంతో కళ్ళు తిరిగి ఉంటుందేమో అని ఆమె దగ్గర ఉన్న బ్యాగును తీసి చూడగా అందులో అధిక మోతాదులో టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఉన్నట్లుగా నిర్ధారించుకున్న ఆయన వెంటనే ఆమెను ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి వివరాలను తెలుసుకుని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన స్వరూపరాణిగా గుర్తించిన ఆయన బంధువులకు వెంటనే సమాచారం అందించారు. ఆయన సమయస్ఫూర్తితో ఒక నిండు ప్రాణాన్ని కాపాడటం తో స్థానికులు ఆయనను అభినందించారు.