Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే, మేయర్లలో కొరవడిన సఖ్యత
ఏడు నెలల నుంచి ఆశావహుల ఎదురుచూపు..
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
గ్రేటర్ వరంగల్ నూతన కౌన్సిల్ ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా కో-ఆప్షన్ సభ్యులను మాత్రం నేటికి నియమించలేదు. కో-ఆప్షన్ పదవుల కోసం పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థలోని 66డివిజన్లకు ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరుగగా, మే మూడో తారీఖున ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాలు వెలువడి ఏడు నెలలు గడిచినప్పటికీ ఎమ్మెల్యే, మేయర్ల సఖ్యత కొరవడినందువల్లే కో-ఆప్షన్ పదవుల నియామకాల్లో జాప్యం జరుగుతుందని సమాచారం. గతంలో కార్పొరేటర్లు ఎన్నికైన అనంతరం వెంటనే కో-ఆప్షన్ సభ్యులను సైతం నియమించే వారూ. కానీ గ్రేటర్లో ఎమ్మెల్యే, మేయర్లలో సఖ్యత కొరవడం వల్ల కో-ఆప్షన్ సభ్యుల నియామకం జాప్యం అవుతుందని పలువురు బహిరంగంగా చెప్పడం గమనార్హం. ఆశావహులు పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లను కలిసినప్పటికీ అంతర్గత పోరుతో కో-ఆప్షన్ సభ్యుల నియామకం జరగడం లేదని సమాచారం. ఆశావహులు వెంటనే స్పందించి కో-ఆప్షన్ సభ్యుల నియామకం చేపట్టాలని కోరుతున్నారు.