Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అను గుణంగా దేశంలో పేదలు అభివృద్ధి చెందడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. తొర్రూర్, పెద్ద వంగర మండలాల్లో క్రైస్తవులకు క్రిస్మస్ కానుక లను అందజేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భం గా మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అను గుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. పేదరికం పోవాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. బీజేపీ దేశంలో మతోన్మాదంతో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం ఆరాపడుతోందని మండిపడ్డారు. గత పాల కులు పండుగలను విస్మరించారని చెప్పారు. స్వరాష్ట్రంలో అన్ని మతాల పండగులను సీఎం కేసీఆర్ గౌరవిస్తూ పేదలకు దుస్తులు అందిస్తు న్నారని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1.95 లక్షల మంది పేద క్రైస్తవు లకు బట్టలను కానుకగా ప్రభుత్వం ఇస్తోందన్నారు.