Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
సహస్ర ఆటో యూనియన్ అభివద్ధికి, డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సహస్ర ఆటో యూనియన్ కమిటీ సభ్యులు తెలిపారు. మండలంలోని పసర గ్రామంలో సహస్ర ఆటో యూనియన్ (మేడారం పసర అడ్డా) సీనియర్ నేతల అధ్యక్షతన ఆదివారం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భూక్య హంజి, ఉపాధ్యక్షునిగా భూక్య రతన్‌సింగ్, ప్రధాన కార్యదర్శిగా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడారు. అడ్డ సమస్యల పరిష్కారం కోసం ఆటో యూనియన్ అభివద్ధి కొరకు పని చేస్తామన్నారు. అపరిష్కతంగా ఉన్న డ్రైవర్ల సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సర్వర్, కాళిదాస్, రామ్మూర్తి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.