Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
స్థానిక సంస్థల బలోపేతానికి సహకరిం చాలని, రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలులో చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ను ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా కన్వీనర్ వేం వాసుదేవరెడ్డి కోరారు. జిల్లాలో 10 కోర్టుల భవనాల ప్రారంభోత్సవానికి వచ్చిన జస్టిస్ రమణను వాసుదేవరెడ్డి హన్మకొండలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను బహూకరించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడారు. తాను గతంలో హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో జస్టిస్ రమణ వద్ద పని చేసిన నాటికి జ్ఞాపకాలను గుర్తు చేశారు. ప్రజాసేవ కోసం ప్రభుత్వ సర్వీస్‌కు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు రమణకు తెలిపారు. తను భవిష్యత్‌లో చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు ఆశీర్వదించాలని కోరారు. త్వరలో సేవా కార్యక్రమాల నిర్దిష్ట ప్రణాళికతో ఢిల్లీకి వెళ్లి జస్టిస్ రమణను మరోసారి కలిసి ఆశీస్సులు తీసుకుంటానని విలేకరులకు వాసుదేవరెడ్డి చెప్పారు.