Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ లీగల్
కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆదివారం వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావనీర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, పోర్టుఫోలియో జడ్జి నవీన్ రావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కే పశుపతి ఈశ్వర నాథ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి రాజశేఖర్ రెడ్డి, ఉజ్జల్ భుయాన్, హైకోర్టు జీపీ భైరపాక జయాకర్, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నరసింహారావు, బార్ కౌన్సిల్ మెంబర్లు సిరికొండ సంజీవరావు, జిల్లా కోర్టు జీపీ తక్కలపెల్లి శ్యామ్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.