Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైౖతుబంధు మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు
నవతెలంగాణ - రాయపర్తి
రైతులను కన్నీరు పెట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ చావు డప్పు దరువుతో చరమగీతం పాడడం ఖాయమని రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు అభివర్ణించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడంతో కేంద్రంలో చలనం వచ్చిందన్నారు. కేసీఆర్ ధర్నా చేయడంతోనే మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ పరిహారం అందించడం సంతోషకారం అన్నారు. రైతుల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు నేడు మండలంలో జరిగే ధర్నాకు ముఖ్యఅతిథిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వస్తున్నట్లు తెలిపారు. ధర్నాకు రైతు సోదరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, పార్టీ ఉపాధ్యక్షులు ఎండీ నాయిమ్, గబ్బెట బాబు, సతీష్, ప్రధాన కార్యదర్శి పూస మధు, మహిళ విభాగం నాయకురాలు నర్మద తదితరులు పాల్గొన్నారు.