Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫోటో2: సిపిఎం లోగో లతో నాయకులు
ఫోటో3:ఎర్ర జెండా లతో రూపొందించిన వక్షం
నవతెలంగాణ-గార్ల
ఉద్యమాల పురిటి గడ్డగా ప్రజాహృదయాల్లో నిలిచిపోయిన గార్ల మండల కేంద్రం ఎరుపుమయమైంది. స్థానిక సత్తార్మియానగర్లో సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు నేడు ప్రారంభం కానున్నాయి. సాయుధ పోరాటంలో మానుకోట తాలుకాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీకి బలంగా ఉన్న మండలాల్లో ఒకటిగా ఉన్న గార్లలో జిల్లా మహాసభల విజయవంతానికి అ పార్టీ శ్రేణులు నెలరోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తూ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. గార్ల కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పార్టీ విస్తరణకు ఎనలేని కషి చేసిన అమరుడు షేక్ సత్తార్ మియానగర్లోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో మహాసభల నిర్వహణకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరు కానుండగా మహాసభలను పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, జి నాగయ్యలతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి రాములు, రాష్ట్ర నాయకులు సోమయ్య, పాలడుగు భాస్కర్, వంగూరి రాములు, జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ హాజరవుతారు. మూడేండ్లకోసారి మహాసభలు నిర్వహించి కార్యవర్గాన్ని ఎంపిక చేసి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకునే ఆనవాయితీ పార్టీకి ఉంటుంది. కరోనా నేపథ్యంలో నాలుగేండ్ల తర్వాత మహాసభలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో మహాసభల ప్రచారం నిర్వహించారు. మహాసభల కోసం సుమారు 50 మంది రెడ్ షర్ట్ వాలంటీర్ల బందం సిద్ధంగా ఉంది. గత నాలుగేళ్లలో జిల్లా, మండలాలకు చెందిన ఉద్యమాల చిత్రాలతో రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రజాఉద్యమాల రూపకల్పనే ఎజెండా..
గత నాలుగేండ్లలో సీపీఐ(ఎం) అలుపెరుగని పోరాటాలు నిర్వహించింది. కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కేంద్రంలో పేదలు వేసుకున్న గుడెసెల తొలగింపును అడ్డుకుని బాధితులకు అండగా నిలిచింది. బీజేపీ బలవంతంగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు రైతు ఉద్యమాలకు అండగా నిలబడి వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్మించింది. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు, జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, తదితర సమస్యలపై అందోళనలు నిర్వహించారు. గార్లలో రాంపురం చెక్‌డ్యామ్ ఎత్తు పెంచాలని, 30 పడకల ఆస్పత్రిలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీలతో కలిసి అందోళనలు చేసి స్థానిక ఎంపీకి, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు వైద్యులు, సిబ్బందిని నియమించాలని, సీతారామ ప్రాజెక్టు భూనిర్వసితులకు పరిహారం ఇవ్వాలని అనేక సార్లు అందోళనలు చేశారు. సీతంపేట పెద్దచెరువును కబ్జా నుంచి కాపాడాలని, అదివాసీల భూముల్లో ట్రెంచ్ పనులు అపాలని, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పోడు సాగుదారులకు పట్టాల కోసం అందోళనలు నిర్వహించారు. జిల్లా, మండల అబివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం, చెక్‌డ్యామ్ హైలెవల్ నిర్మాణం, తదితర తీర్మానాల అమోదానికి వేదిక కానున్నాయి. రానున్న కాలంలో ప్రజాఉద్యమాలను ముందుకు నడిపే నూతన నాయకత్వాన్ని కుడా మహాసభలో ప్రజాప్రతినిధులు ఎన్నుకోనున్నారు. రాజకీయ పరిజ్ఞానం, ఉద్యమాల నిర్మాణం, వర్తమాన అంశాలు, పాలక ప్రభుత్వాల తప్పుడు విధానాలు, కమ్యూనిస్టు ఆచరణ, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యచరణపై మహాసభలో చర్చిస్తారు.