Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంఘం రాష్ట్ర చైర్మెన్ నేతి రాజేశ్వర్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
ఆర్ఎంపీలను, పీఎంపీలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మెన్ నేతి రాజేశ్వర్‌రావు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించడంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు కీలకమని ఆయన చెప్పారు. డివిజన్ కేంద్రంలోని రేవూరి నర్సయ్య ఫంక్షన్ హాల్లో డివిజన్ అధ్యక్షుడు షేక్ అంకూస్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన డివిజన్ మహాసభ లకు సంఘం జిల్లా అధ్యక్షుడు గౌరోజు రవీంద్రచారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీధర్‌రావు, డివిజన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావులతో కలిసి రాజేశ్వరరావు మాట్లాడారు. ఆర్ఎంపీలకు, పీఎంపీలకు చట్టబద్ధత కల్పించి హెల్త్ ప్రొవైడర్లుగా వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఆర్ఎంపీ లకు ప్రత్యేక గుర్తింపునిస్తే రోడ్డు సౌకర్యాల్లేని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం అత్యవసర వైద్యం అందుతుందని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ కోసం ఆర్ఎంపీలను భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి గ్రామీణ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించాలని గుర్తు చేశారు. కరోనా వైరస్ బారిన పడి అనేకమంది ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు మతి చెందారని ఆందోళన వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 శాతం ప్రజలు ఆర్ఎంపీలు, పీఎంపీల మీదే ఆధారపడుతున్నారని చెప్పారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం పారామెడికల్ శిక్షణా ఇవ్వడంతోపాటు సర్టిఫికెట్లు అందించాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హన్మంతరావు, రాష్ట్ర సలహాదారు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సర్వర్ పాషా, నాయకులు మల్లేశం, రవీంద్రచారి, చాగంటి భీముడు, నజీర్ అహ్మద్, యాకయ్య, కళాధర్, రాజు, వీరాచారి, వీరారెడ్డి, కళాధర్, దొంతు సత్యం, పురుషోత్తం, అంబాదాస్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.