Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే 100రోజుల క్రాష్ప్రోగ్రాం సేవలను వినియోగించుకోవాలని జెడ్పీటీసీ పిట్టల శ్రీలత అన్నారు. సోమవారం 100రోజుల క్రాష్ ప్రోగ్రామ్ లో భాగంగా జానకీపురంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు పర్యవేక్షించారు. అనంతరం స్థానిక సర్పంచు కుర్సపల్లి నవ్య ప్రవీణ్, డీవైఈఈ సునీత, వేయిల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మిషన్ భగీరథ నీటి సరఫరా విషయంలో సమస్యలుంటే సర్పంచులకు, ఎంపీటీసీలకు, మిషన్ భగీరథ అధికారుల దష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ, గ్రామ ఉపసర్పంచ్ పొల్లు రవి మోహన్ రెడ్డి,గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.