Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హన్మకొండ హనుమాన్ నగర్ డబ్బాల ప్రాంతంలోని దాసాంజనేయ స్వామి అలయ భూముల జోలికి వస్తే ఊరుకోమని, ప్రభుత్వం ఈ భూములను పరిరక్షించాలని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. సోమవారం ఆ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆలయానికి చెందిన దాదాపు 100కోట్ల విలువ గల 11వేల గజాల భూమిని పరిరక్షిస్తామని ఆమె తెలిపారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని లేకుంటే పారీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ భర్త గుంటి శ్రీనివాస్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు కురిమిండ్ల సదానందం, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు బండి కుమార్, కాంగ్రెస్ డివిజన్ భాద్యులు కందికొండ రాజు, ఆలయ పరిరక్షణ కమిటీ నాయకులు వేముల వెంకట్, బీజేపీ జిల్లా నాయకులు దేశిని సదానందం గౌడ్ పాల్గొన్నారు.