Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
వినియోగదారుల రక్షణ చట్టంపై విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకొని ప్రయోజనాలను పొందాలని వినియోగదారుల సమన్వయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అప్పలరావు పేట జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ అన్నారు. సోమవారం స్టూడెంట్ కన్స్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచి వినియోగ విద్యపై అవగాహన పెంపొందించాలని ఉద్దేశంతో, వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాన్ని ప్రతిఒక్కరూ పొందాలనే సంకల్పంతో ప్రభుత్వము, వినియోగదారుల సంస్థలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వినియోగదారుల క్లబ్బులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఈ చట్ట ప్రయోజనాలను సమాజంలో ఉన్న అందరికీ చేర్చడం సాధ్యమవుతుందన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో మోసాలను అరికట్టేందుకు గాను వినియోగదారుల రక్షణ చట్టం 2019 ఎంతో ప్రయోజనకరంగా తీర్చిదిద్దడము జరిగిందన్నారు. విద్యార్థులకు వినియోగ విద్యపై అవగాహన కల్పించితే వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. అందుకే మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ , యాకయ్య భూలక్ష్మి, యాకుబ్ పాషా, శ్యాంసుందర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.