Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యాశాఖ మంత్రిని తొలగించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఇంటర్ ఫలితాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల చావుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ - కాశిబుగ్గ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యార ప్రశాంత్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడం ఇంటర్ బోర్డు వైఫల్యానికి నిదర్శనమన్నారు. కరోనా కారణంగా క్లాసులు జరగక, ఆన్లైన్ క్లాసులు వినక పరీక్షలు రాయడానికి సిద్ధంగా లేమని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తెలిపినా వినిపించుకోలేదన్నారు. అంతేకాకుండా ఎలా రాసిన పాస్ చేస్తామని చెప్పిన ఇంటర్ బోర్డు అధికారుల వల్లనే విద్యార్థులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించకపోవడం దారుణమని, ఆమెను వెంటనే మంత్రి వర్గం నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంత గణేష్, మునగాల చంటి, చుక్క ప్రశాంత్, రవికుమార్, శ్రీనివాస్, కష్ణ, శ్రీ వాణి, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు