Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
క్రిస్మస్ పండుగ అందరిదని వరంగల్ అర్భన్ జెడ్పీ ఛైర్మన్ డాక్టర్ మారపాక సుధీర్‌కుమార్ తెలిపారు. ఆదివారం కాజీపేట ఫాతిమా కేథిడ్రల్ చర్చి ఆవరణలో కేథలిక్, ట్రైసిటీస్ క్రిష్టియన్ ఫెలోషిప్ (టిసిఎఫ్), స్వతంత్య్ర సంఘాల నేతృత్వంలో జరిగిన ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రైస్తవ సంఘాలన్ని కలిసి ఐకమత్యంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఐక్యంగా క్రిస్మస్ వేడుకలు : బిషప్ ఉడుమల బాల
గత తొమ్మిదేండ్లుగా అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలను ప్రతియేటా జరుపుకోవడం ఆనందదాయకమని వరంగల్ డయసీస్ కేథలిక్ బిషప్ డాక్టర్ ఉడుమల బాల అన్నారు. అన్ని క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.
అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని బిషప్ డేనియల్ కళ్యాణపు, బిషప్ జాన్ మార్కండేయలు అన్నారు. బిషప్ ఉడుమల బాల కృషితో గత తొమ్మిందేండ్లుగా ఈ వేడుకలు జరుపుకుంటున్నా మన్నారు. టీసీఎఫ్ ఉపాధ్యక్షుడు జోసెఫ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ వేడుకలను ప్రతియేటా జరుపుకుంటు న్నామని, అన్ని సంఘాలు సంతోషంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వేడుకల జనరల్ కన్వీనర్ ఫాదర్ కె. విజరుకుమార్, జాన్ బన్నీ, సిస్టర్ సెల్వి, ఫాతిమా కెథిడ్రల్ చర్చి విచారణ కమిటీ అధ్యక్షులు టి. మత్యాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ నమిండ్ల సురేందర్ నేతృత్వంలో సిసిలియా గాయక బృందం పాటలు పాడి సభికులను అలరించారు.