Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల మనోభావాలను గుర్తించి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద క్రైస్తవులకు అందజేసిన క్రిస్మస్ దుస్తులను సోమవారం పట్టణంలోని బిలీవర్స్ చర్చిలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో పేద క్రైస్తవులు తమ ముఖ్యమైన పండుగ రోజున కొత్త వస్త్రాలు ధరించి సంబురాలలో పాలుపంచుకోవాలనే ఆకాంక్షతో సీఎం కేసీఆర్ కానుక రూపంలో దుస్తులను అందజేస్తున్నారన్నారు. క్రైస్తవులకు ఎమ్మెల్యే ముందస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పీ.పవన్ కుమార్, తహశీల్దార్ రాంమూర్తి, మున్సిపల్ వైఎస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,సీసీవోసీ డివిజన్ అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ రూబెన్, సెక్రటరీ ఆనంద్‌రాజు,ట్రెజరర్ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.