Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డాక్టర్ మార్త రమేష్ అన్నారు. సోమవారం లక్ష్మీ నరసింహా ఆసుప్రతి మొదటి వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా బీపీ, మధుమేహం పరీక్షలు చేసి రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతిఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. కనీస నియమాలను అనుసరిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండేండ్లగా కరోనా బారినపడిన బాధితులకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇతర సాధారణ రోగులకు తమ వంతు బాధ్యతగా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు.ఈ వైద్య శిబిరంలో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన వారికి వైద్య పరీక్షలు, మందులను పంపిణీ చేశారు.