Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రజా ప్రతినిధులు శవయాత్రలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర నాయకులు వన్నాల శ్రీరాములు, చింతాకుల సునీల్, కుసుమ సతీశ్‌లు మండిపడ్డారు. బీజేపీ వరంగల్ తూర్పు ఇంచార్జి కుసుమ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ హెడ్ పోస్టాఫీసు సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై నిరసనగ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది రైతుల నుంచి సేకరించిన 34లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపకుండా రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పడం దారుణమన్నారు. ధాన్యం సేకరించి కేంద్రానికి పంపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపైనే ఉందని ఆరోపించారు. కార్పొరేటర్ చింతకుల అనిల్, ఎరుకల రఘునారెడ్డి ,మార్టిన్ లూథర్, దీనదయల్, శ్యామ్ సుందర్, కిరణ్ పాల్గొన్నారు.