Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఓరుగల్లు మహా సమాఖ్య అధ్యక్షురాలు మోటూరి శ్వేతను గ్రామాఖ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. సోమవారం గురిజాల గ్రామంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల ఓరుగల్లు మహా సమాఖ్య అధ్యక్షురాలుగా ఎన్నికైన మోటూరి శ్వేతను వీవో మహిళలు శాలువతో సన్మానించారు. గురిజాల గ్రామానికి చెందిన మండల సమాఖ్య అధ్యక్షురాలుగా, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓరుగల్లు మహా సమాఖ్య అధ్యక్షురాలుగా ఎన్నికకావడం గర్వకారణమన్నారు. మహిళలను చైతన్యవంతులుగా చేయడంతో పాటు సంఘాలు ఆర్థిక పరిపుష్టత సాధించేందుకు శ్వేత కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ మహేందర్, భూమిక గ్రామాఖ్య సంఘం అధ్యక్షురాలు చిన్నపెల్లి సుజాత, ఉపాధ్యక్షురాలు గొడిశాల రమ, కార్యదర్శి యెడ కల్పన, సహాయ కార్యదర్శి ముడుసు అరుణ, కోశాధికారి జనగం రమ, సీఏ జనగం సునిత, ఎస్‌హెచ్‌జీ సంఘాల అధ్యక్ష, కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు.