Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని చైల్డ్‌లైన్ జిల్లా సభ్యురాలు మమత అన్నారు. సోమవారం ఉకల్లో సర్పంచ్ కూంచారాపు హరినాథ్ ఆర్థిక సహకారంతో వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. చైల్డ్ లైన్ 1098 టోల్ ప్రీ నెంబర్ మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18ఏండ్లలోపు వారీ సంరక్షణ కోసం చైల్డ్ లైన్ 1098 పనిచేస్తుందని తెలిపారు. బాల్య వివా హాలు చట్ట రీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు చేస్తే రెండు సంవత్స రాలు జైలు శిక్ష, ఒక లక్ష జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరి ంచారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.