Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
పెద్దకొడపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఆజాదీకా అమత్ మహౌత్సవాల్లో భాగంగా వరంగల్ అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీ రవీందర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాఠశాలల్లోని విద్యార్థులకు, గ్రామస్తులకు 300 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పెద్దకొడపాక గ్రామ నివాసి రిటైర్డ్ ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంద విజరు కుమార్, డాక్టర్ ప్రొఫెసర్ దుర్గాబాయి దంపతులు 50 వేల విలువగల మెడిసిన్‌ను గ్రామస్తుల కోసం అందించారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తోట వేణుగోపాల్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శిరీష, డాక్టర్ కమల కుమారి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ భవాని, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండీ మొహిబోద్దీన్, ఎంపీటీసీలు మాచర్ల మంగమ్మ రవి, వావిలాల వేణుగోపాల ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, వార్డు సభ్యులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.