Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
బాలల రక్షణ అందరి బాధ్యతని 44వ డివిజన్ కార్పొరేటర్ జలగం అనిత రంజిత్‌రావు అన్నారు సోమవారం కడిపికొండ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బేటీబచావో బేటి పడావో సందర్భంగా బాలల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. 6-14ఏండ్ల పిల్లలందరూ చదువుకోవాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు. సీడబ్ల్యూసీ మెంబర్ దామోదర్ మాట్లాడుతూ.. లింగవివక్షను విడనాడాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్ శ్రీనివాస్ చైల్డ్ హెల్ప్ లైన్, మహిళా హెల్ప్ లైన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వనజ, రాజ్యలక్ష్మి, స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం స్వరూప, వీఓ అధ్యక్షురాలు, అంగన్వాడీ టీచర్లు ప్రభావతి, సరిత, అరుణ, శోభ తదితరులు పాల్గొన్నారు.