Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
స్థానిక వ్యవసాయ మార్కెట్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, పంచాయతీ, పోస్ట్ ఆఫీస్, హై స్కూల్ ప్రాంతాలలో డబ్బాలు తొలగించడంతో ఉపాధి కొల్పోయిన చిరువ్యాపారులను ఆదుకోవాలని సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి సీపీఐ(ఎం) నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించి బాధితుల జీవనోపాధిని కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు మొక్కపాటి వెంకటేశ్వర్లు, లింగాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.